Sunday, January 19, 2025
HomeTrending Newsవచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే: బాబు

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే: బాబు

Youth – Politics: రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న, సమాజంపట్ల అంకితభావం ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. నలభై ఏళ్ళకు కావాల్సిన యువతరాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటామని, రాబోయే ఎన్నికల్లో 40శాతం సీట్లు యువతకు కేటాయిస్తామని ప్రకటించారు. తెలుగుదేశం 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్  లో ఘనంగా జరిగాయి పార్టీ పునర్ వైభవానికి ఏడు సూత్రాల కార్యక్రమాన్ని చంద్రబాబు సభా వేదికగా ప్రకటించారు. అంతకుముందు  పార్టీ ఆవిర్భావించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ను చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి సందర్శించారు, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన సభలో బాబు ప్రసంగించారు.

చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

టీడీపీకి ప్రత్యేకత ఉంది. ఓ శుభ ముహూర్తంన పార్టీ పెట్టారు. ఎన్నో కష్టాలు వచ్చిన నిలదొక్కుకున్నాం.
ఎన్టీఆర్ అధికారం కోసం పార్టీ పెట్టలేదు. ఉనికి లేని జాతి కోసం ముందుకు వచ్చారు.
ఆవేశంలో పుట్టిన పార్టీ టీడీపీ. సమీకరణాలతో పుట్టిన పార్టీ కాదు.
తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్.
తెలుగువారి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ.
విజన్ 2020 తయారు చేస్తే ఈ 420లు నన్ను ఎగతాళి చేశారు.
నా తర్వాత వచ్చిన సీఎంలు విధ్వంసం చేయలేదు. అలా చేస్తే అభివృద్ధి ఆగిపోయేది
చేతనైతే ఇంకా అభివృద్ధి చేయండి చేత కాకపోతే వదలి పెట్టండి.
తెలంగాణ ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. అభివృద్ధి చేశా..
హైదరాబాద్ లో అడుగడుగునా నా కష్టం ఉంది.
అమరావతి లో 33వేల ఎకరాలు స్వచ్చందంగా ఏపీ రైతులు రాజధాని కోసం ఇచ్చారు.
ఇప్పుడు కులం రంగు పూశారు.
విభజన తర్వాత తెలంగాణలో ఒక ప్రాజెక్టు కట్టారు. పోలవరం కట్టి నదుల అనుసంధానం చేశాం.
ఇక్కడ ప్రాజెక్టు పూర్తి అయ్యింది నీళ్ళు వచ్చాయి.
ఏపీలో ప్రాజెక్టుల పరిస్థితి ఏమైందో తెలియదు రాజకీయ నాయకుల్ని అడగాలి.
అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ వెళ్లా. మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చారు. అలాంటి దేశం మీద అవినీతి ముద్ర వేసి పంపింది ఇప్పటి ప్రభుత్వం.
నేను చేసింది నా కోసం కాదు… తెలుగు జాతి కోసం
సంక్షేమ కార్యక్రమాలు జరగాలి. పేదరికం పోవాలి. పేదల్ని నీరు పేదలు చేయడం రాజకీయ పార్టీల పని కాదు
సంపద సృష్టించాలి… ఆర్థిక అసమానతలు తొలగించాలి. 40 ఏళ్లలో టీడీపీ చేసింది అదే
తెలుగుదేశాన్నీ తెలుగు జాతిని వేరు చేసి చూడలేం
టీడీపీ పై కుట్రలు చేసిన వాళ్ళు… కుట్రలకే బలైయ్యారు
40 ఏళ్లకు సరిపడ నాయకుల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది
సమర్థ యువ నాయకుల్ని తయారు చేయాలి. యువ రక్తం పొంగాలి.
రానున్న ఎన్నికల్లో 40శాతం సీట్లు యువతకు కేటాయిస్తా…
సమజాహితం కోరే వారు రాజకీయాల్లో కి రావాలి
ఏపీలో రాజకీయ విధ్వంసం జరిగింది. ప్రజాస్వామ్యం లేదు.
రాజారెడ్డి రాజ్యాంగం కాదు… అంబేద్కర్ రాజ్యాంగం ఉంది.
ఈ పార్టీని కాపాడండి.. కుటుంబ సభ్యులను చంపినా టీడీపీ జెండా వదలొద్దు.
కార్యకర్తల రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది.
కార్యకర్తలను ఆర్థికంగా దోహదం చేసేందుకు ప్రయత్నం చేస్తా.
70 లక్షల సైన్యం ఉంది. అందర్ని ఆదుకుంటా.
కార్యకర్తలు విరాళాలు ఇస్తే టీడీపీకి ఆర్థిక ఇబ్బంది ఉండదు.
వచ్చే ఎన్నికల్లో యువతకు  ప్రాధాన్యం ఇస్తాం
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పునరంకితం కావాలి

Also Read : ఇది నిరంకుశత్వం: నారా లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్