Friday, September 20, 2024
HomeTrending NewsPeddireddy: ఇసుకపై బాబుది గోబెల్స్ ప్రచారం

Peddireddy: ఇసుకపై బాబుది గోబెల్స్ ప్రచారం

రాష్ట్రంలో తమ   ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టిని మళ్ళించేందుకే  చంద్రబాబు ఇసుక దోపిడీ అంటూ అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతికశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ  చంద్రబాబు గెబెల్స్ మాదిరిగా తప్పుడు ఆరోపణలతో ప్రజలను పక్కదోవ పట్టించేందుకు
ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. దానిలో భాగంగానే ఇసుక దోపిడీ అంటూ పవర్  పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో అర్థంలేని ఆరోపణలకు దిగాడని అన్నారు. తాము చేస్తున్న మంచిని  మరుగున పరచాలంటే చంద్రబాబుకు దూషణలే దిక్కయ్యాయని ఎద్దేవా చేశారు.

ఇసుక కోసం నిర్వహించిన టెండర్లలో పాల్గొనలేదని ప్రశ్నించారు. ఒకవేళ ఆరోజు గుర్తు లేకపోతే తరువాత అయినా  పాల్గొనవచ్చని, దానికి చాలా సమయం ఇచ్చామని అన్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ టన్నుకు రూ. 375 ప్రభుత్వానికి చెల్లించాలని, మరో వంద రూపాయలు వారి అడ్మిసిస్ట్రేటీవ్ ఖర్చులుగా తీసుకుంటారని, మొత్తంగా  రూ. 475 టన్ను ఇసుకను ప్రభుత్వానికి విక్రయించాలని నిబంధనలో ఉందని, ఇందుకు భిన్నంగా ఎక్కడైనా జరిగితే ప్రజలు మా దృష్టికి తీసుకరావాలంటూ… నియోజకవర్గాల వారీగా. డిపోల వారీగా. రవాణా చార్జీలతో కలిపి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను ప్రతివారం పత్రికల్లో ప్రకటిస్తున్నామని వివరించారు. ఇసుక అక్రమాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావడం జరిగిందని, రెండు లక్షల రూపాయలు జరిమానా, రెండేళ్ళ వరకు జైలుశిక్ష విధించేలా చట్టాలు చేశామని పేర్కొన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం పేరుతో ఎవరికి ఉచితంగా ఇచ్చారని నిలదీశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు  చేశారని,  ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించారని విమర్శించారు

నలబై వేల కోట్ల ఇసుక అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు ఏ లెక్కల ప్రకారం మాట్లాడుతున్నారని,  ఏడాదికి రూ. 765 కోట్లు ఆదాయం వస్తోందని, ఈ నాలుగు సంవత్సరాల్లో సుమారు మూడు వేల కోట్లు
ఆదాయం లభించినట్లు అవుతుందని అన్నారు. చంద్రబాబు చెబుతున్న లెక్కల ప్రకారం నలబై
వేల కోట్లు, మా హయాంలో వచ్చిన మూడు కోట్లు కూడా కలిపితే మొత్తం 43వేల కోట్లు మీ అయిదేళ్ళ పాలనలో దోపిడీ జరిగిందని అంగీకరిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అర్థంపర్థం లేని అబద్దాలు, అభూతకల్పనలతో మాట్లాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్