Sunday, January 19, 2025
HomeTrending Newsమునిరాజమ్మకు 5 లక్షల సాయం

మునిరాజమ్మకు 5 లక్షల సాయం

శ్రీకాళహస్తి కి చెందిన బిసి మహిళ మునిరాజమ్మకు 5 లక్షల రూపాయాల తక్షణ ఆర్ధిక సాయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అందించారు. ఇటీవల యువ గళం పాదయాత్ర శ్రీకాళహస్తిలో జరిగిన సందర్భంలో   నారా లోకేష్ ను మునిరాజమ్మ కలుసుకున్నారు.  బిసి రజక సామాజిక వర్ఘానికి చెందిన తాను తోపుడు బండిపై టిఫిన్‌ సెంటర్‌ నడుపుకుంటున్నానని,  వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేసి ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసి తిరిగి రివర్స్‌లో తనపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని ఆమె వాపోయారు. తన ఇంటిని కూడా కూలస్తామంటున్నారని.. ఎమ్మెల్యేకి క్షమాపణ చెబితే క్షమించి వదిలేస్తారని కొందరు తనకు రాయబారం పంపారని, తన భర్త కూడా భయపడిపోయి.. ఎమ్మెల్యే దగ్గరకు పోయి క్షమాపణలు చెబుదామని గొడవ చేశాడని చెప్పారు. ఇల్లు కూల్చేస్తే చెట్లు కిందైనా ఉందాం.. అంతే తప్ప ప్రాణం పోయినా ఎమ్మెల్యేకి భయపడి క్షమాపణ చెప్పేది లేదని తెగించి చెప్పానని’ లోకేష్ తో అన్నారు. లోకేష్ ఆమెకు ధైర్యం చెప్పి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నేడు మునిరాజమ్మ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలుసుకున్నారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్న బాబు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చి  ఆర్ధిక సాయాన్ని అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్