Monday, July 1, 2024
HomeTrending NewsSajjala: బాబు ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నారు

Sajjala: బాబు ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నారు

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టిడిపికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినట్లు ఉన్నారని,  ఆమెకు వేరే అజెండా ఏమీ లేదని, ఢిల్లీ వెళ్లి తన మరిదిని విడిపించే పనిలోనే ఉన్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేపట్టినప్పుడు కూడా ఆమె బాబు వెంటే ఉన్నారని గుర్తు చేశారు. బాబు ఒక రకంగా అదృష్టవంతుడని, ఆయన ఏం చేసినా ఎన్టీఆర్ కుటుంబం అంతా మద్దతు ఇస్తారని ఎద్దేవా చేశారు. పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ లో ఉన్నా, ఇప్పుడు బిజెపిలో ఉన్నా బాబుకు అండగానే ఉన్నారన్నారు. ఇప్పుడు కూడా ఢిల్లీలో బిజెపి నేతలను కలిసి బాబును అర్జెంటుగా విడుదల చేయించే పనిలో ఆమె ఉన్నారని, భవిష్యత్తులో బిజెపి కోసం ఏమి చేయడానికైనా బాబు సిద్ధపడ్డట్లు తెలుస్తోందన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు అవినీతి జరగలేదని బాబు తరఫు న్యాయవాదులు చెప్పడం లేదని, కేవలం అనుమతి లేకుండా అరెస్టు చేశారని మాత్రమే వాదిస్తున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అక్రమాలు జరగలేదని బాబు తరఫున లాయర్లు సుప్రీంకోర్టులో ఒక్క ఆధారం కూడా చూపించలేద
  • రూ.3,300 కోట్ల ప్రాజెక్టును నామినేషన్‌ పద్ధతిలో సీమెన్స్‌ కంపెనీకి అప్పగించారు
  • ప్రాజెక్టులో రూ.370 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది
  • ఒక ప్రైవేటు వ్యక్తిని తెచ్చి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో, తన సీఈవోగా నియమించుకున్నారు
  • మార్కెట్‌ స్టడీ చేయకుండానే సీమెన్స్‌ కంపెనీకి ప్రాజెక్టును అప్పగించారు
  • రూ.371 కోట్లలో రూ.241 కోట్లు షెల్‌ కంపెనీలకు మళ్లించారు
  • రూ.241 కోట్లు నిధులు దారిమళ్లాయని 2017లోనే జీఎస్టీ అధికారులు హెచ్చరించారు
  • 2018లోనే సీమెన్స్‌ కంపెనీ స్కిల్‌ స్కాంకు, మాకు ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చింది
  • ఈ స్కాంలో తనకు సంబంధంలేదు అని చెప్పడానికి బాబు దగ్గర ఒక్క ఆధారమైనా ఉందా?
  • రూ.371 కోట్లు కొట్టేయడానికే ప్రాజెక్టు వ్యాల్యూను రూ.3,300 కోట్లుగా చూపించారు. నిజానికి ప్రాజెక్టు వ్యాల్యూ రూ.371 కోట్లే
  • ఈ ప్రాజెక్టులో సీమెన్స్‌ కంపెనీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు
  • షెల్‌ కంపెనీలు సృష్టించి రూ.371 కోట్లు దోచేశారు అని నిరూపించేందుకు ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ పోలీసులు బాబును అరెస్ట్‌ చేశారు
  • 021లోనే సీఐడీ కేసు నమోదు చేసింది, ఈడీ ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేసింది
  • స్కాం జరిగిందని ఆధారాలు సేకరించి ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత మాత్రమే సీఐడీ బాబును అరెస్ట్‌ చేసింది
  • ఏసీబీ కోర్టు కూడా స్కాం జరిగిందని నిర్ధారించుకున్నాకే బాబును జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించింది
  • బాబు లాయర్లు స్కాం జరగలేదని నిరూపించకుండా క్వాష్‌ పిటిషన్‌ మీదే సుప్రీంకోర్టులో పట్టుబట్టారు
  • కేసులో విచారణ ముందుకు వెళ్తే బాబు ఎక్కడ దోషిగా నిరూపించబడతాడో అనే భయంతో ఆయన లాయర్లు విచారణకు రాకుండా సెక్షన్‌ 17ఏ గురించి మాత్రమే వాదిస్తున్నారు
  • టెక్నికల్‌ రీజన్స్‌ను సాకుగా చూపుతూ కేసును కొట్టేయించాలని బాబు లాయర్లు ప్రయత్నిస్తున్నారు
  • టిడ్కో ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టులో బాబుకు రూ.120 కోట్లు ముడుపులు ఇచ్చానని
  • షాపూర్‌ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి స్వయంగా చెప్పాడు
  • కేసు ఏసీబీ పరిధిలోకి రాదు అని మాత్రమే బాబు ఆరోపిస్తున్నారు తప్ప, స్కాం జరగలేదని ఎక్కడా చెప్పటంలేదు
  • చంద్రబాబు ఇప్పటికీ తను వ్యవస్థలను మేనేజ్‌ చేయగలనని అనుకుంటున్నాడు
RELATED ARTICLES

Most Popular

న్యూస్