Saturday, January 18, 2025
HomeTrending Newsదివాళా తీయించి ఇచ్చారు: రాంబాబు విసుర్లు

దివాళా తీయించి ఇచ్చారు: రాంబాబు విసుర్లు

You are reason.: చంద్రబాబు దివాళా తీయించిన ప్రభుత్వాన్ని తాము నడుపుతున్నామని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై లేని పోని  ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి వివిధ పథకాలకు  సంబంధించి 40 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్ళారని, వాటిని సిఎం జగన్ తీరుస్తూ వస్తున్నారని,  ఇంకా కొన్ని తీర్చాల్సి ఉండొచ్చని… కానీ ఈ బాకీలు పెట్టిన బాబు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. బిల్లులు ఎగ్గొట్టడం నేరమని, కానీ ఆలస్యంగా ఇవ్వడం తప్పెలా అవుతుందని రాంబాబు ప్రశ్నించారు.

డిస్కాంలకు- 20 వేల కోట్లు, ఫీజు రీఇంబర్స్మెంట్ -1,880, రైతులకు ధాన్యం సేకరణకు ­980, విత్తనాల సబ్సిడీ-960, ఆరోగ్య శ్రీ -680; రైతులకు విద్యుత్ సబ్సిడీ -9 వేలు, రైతులకు సున్నా వడ్డీ- 1,218;  ఇన్ పుట్ సబ్సిడీ -1,110; మరణించిన రైతుల కుటుంబాలు ఎక్స్ గ్రేషియా- 23.45; గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు – 3,480;  అగ్రి గోల్డ్ -264 కోట్ల రూపాయలు బాబు బాకీలు పెట్టి వెళ్ళారని రాంబాబు గణాంకాలతో సహా వివరించారు.

రాష్ట్రంలో ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్దదిగా చేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేలా చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నాయని అంబటి ఆరోపించారు. ఇటీవల బాపట్ల డివిజన్ లో ఇరిగేషన్ పనికోసం టెండర్ పిలిచినప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇస్తామని, ఈ విషయమై కోర్టులు వెళ్ళకూడదని ఒక షరతు పెట్టారని, తాము ఆ విధంగా చెప్పకపోయినా ఒక అధికారి టెండర్ లో ఆ విధంగా పెట్టారని, ఆ విషయం మా దృష్టిలో లేదని మంత్రి స్పష్టం చేశారు.  ఈ టెండర్ ఆధారంగా రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉన్నట్లు, ఎవరికీ బిల్లులు చెల్లించడం లేదంటూ అనేక అపోహలు సృష్టించేలా కొన్ని సంస్థలు వార్తలు ప్రసారం చేశాయని రాంబాబు అసహనం వ్యక్తం చేశారు. పత్రికల్లో రాగానే, దీనిపై చంద్రబాబు చిలువలు పలువలు చేస్తూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

పోలవరంపై దేవినేని చేసిన విమర్శలను రాంబాబు తిప్పికొట్టారు, 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న హామీపై, కాఫర్ డ్యాంలు కట్టకుండా డయా ఫ్రం వాల్ కట్టడంపై ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read : రాజకీయ విషసర్పం బాబు : రాంబాబు  విమర్శ  

RELATED ARTICLES

Most Popular

న్యూస్