We condemn: మాజీ మంత్రి నారాయణ అరెస్టును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. ఈ అరెస్ట్ అక్రమమని, కక్ష పూరితంగా చేశారని మండిపడ్డారు. అసలు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. టెన్త్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, అన్ని అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని, తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే నారాయణను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాస్ కాపీయింగ్ కు, ప్రశ్నాపత్రాల లీకేజీకి ఆయన్ను ఎలా బాద్యుడిని చేసారని ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ కు ఎప్పటి నుంచో నారాయణపై కక్ష ఉందని, ఆయన్ను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని బాబు విమర్శించారు.
ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి, టిడిపి నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని లోకేష్ వ్యాఖ్యానించారు. సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని వదిలేసి టిడిపి నేతల్ని అరెస్ట్ చేయించడం దారుణమన్నారు. దీనివల్ల పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదని అన్నారు.
Also Read :ఏపీ సిఐడి అదుపులో నారాయణ