Friday, March 28, 2025
HomeTrending NewsChandrababu Naidu: ఉగాది వేడుకల్లో చంద్రబాబు

Chandrababu Naidu: ఉగాది వేడుకల్లో చంద్రబాబు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని తన స్వగృహంలో జరిగిన ఉగాది వేడుకల్లో  పాల్గొన్న చంద్రబాబు అనంతరం మంగళగిరి చేరుకొని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కూడా పాల్గొన్నారు. “తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ శోభకృత్ నామ సంవత్సరం మీ అందరి జీవితాలలో ప్రగతి శోభను నింపాలి. కొత్త సంవత్సరం మీ ఇంటిల్లిపాదికీ సంతోష సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ సందేశం ఇచ్చారు.

నాలుగేళ్ళుగా రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయని, కనీసం ఈ శోభకృత నామ సంవత్సరంలో నైనా అందరికీ మంచి జరగాలని,  తెలుగు వారికి ఈ ఏడాది నూతన వెలుగు తేవాలని బాబు ఆకాంక్షించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలు ఉగాది పంచాంగం ముందే చెప్పారని తాను ప్రస్తావించానన్నారు. నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎన్నడూ చూడని అరాచకాలు రాష్ట్రంలో చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్