Sunday, January 19, 2025
HomeTrending Newsవైసీపీ ఓటమి ఖాయం : బాబు ధీమా

వైసీపీ ఓటమి ఖాయం : బాబు ధీమా

అధికారం శాశ్వతం కాదని సిఎం జగన్ గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మూడున్నరేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, అందరంకలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఐదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో మూడురోజుల పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు పొందూరులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికారు.  ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఉతుకుడు ఉతికేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, వారిని తాము అధికారంలోకి రాగానే ఆదుకుంతామని భరోసా ఇచ్చారు.

ఉత్తరాంధ్రపై జగన్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని, ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని బాబు ప్రశ్నించారు. ఐటి ఉత్పత్తులలో మన రాష్ట్రం బీహార్, ఓడిశా రాష్ట్రాలకంటే వెనుకబడి ఉండడం సిగ్గుచేటన్నారు. లక్ష కోట్ల పెట్టుబడుల్లో మన రాష్ట్రం వాటా కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవాలన్నారు. పొందూరు చేనేత కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఐటిని ప్రోత్సహించింది తానేనని, డ్వాక్రా సంఘాలు ప్రవేశ పెట్టి మహిళల ఆర్ధిక స్థితిగతులను మెరుగు పరచింది తామేనని, ఆస్తిలో మహిళలకు సమానా వాటా ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయేనని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్ట ప్రకారం చేస్తే భరించాలా అని నిలదీశారు. ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునేందుకు సిద్ధం కావాలని చంద్రబాబు కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్