Sunday, January 19, 2025
HomeTrending Newsఎవరికీ రక్షణ లేదు: చంద్రబాబు

ఎవరికీ రక్షణ లేదు: చంద్రబాబు

No action: రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని, మచిలీపట్నంలో  విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్, విఏఓ గా నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో  ఈ విషయం మరోసారి రుజువైందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. నాగలక్ష్మి ఆత్మహత్యపై ఓ పత్రికలో వచ్చిన వార్తను జత చేస్తూ ఈ విషయమై ట్విట్టర్ లో స్పందించారు. నాగలక్ష్మి తనను అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు.

“ఒక మహిళ స్వయంగా స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలు తీసుకోని ఈ వ్యవస్థను ఏమనాలి? ప్రజల ప్రాణాల కంటే, బాధితుల వేదనల కంటే….రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ప్రాధాన్య అంశంగా మారిపోయాయి. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలి” అంటూ బాబు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్