Sunday, November 24, 2024
HomeTrending NewsChandrababu: ఇన్నాళ్ళు ఏం దొరికాయి?: సిట్ పై బాబు

Chandrababu: ఇన్నాళ్ళు ఏం దొరికాయి?: సిట్ పై బాబు

తాను ఎవరిని కలిస్తే వైసిపి నేతలకు ఎందుకని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ – తాను సమావేశామైతే వారికెందుకు నొప్పి అని ఎద్దేవా చేశారు.  అంటే ఓడిపోతామని అప్పుడే డిసైడ్ అయ్యారా అంటూ వైసీపీ నేతలకు చురకలు అంటించారు. పొత్తులపై ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు బాగా తెలుసని, తనది 45ఏళ్ళ ఇండస్ట్రీ అని వ్యాఖ్యానించారు. సిట్ అంశంలో సుప్రీం తీర్పుపై స్పందిస్తూ “సిట్ వేసుకోండి, ఇన్నాళ్ళు వెదికారు, ఏం దొరికాయి.. మా అకౌంట్ లోకి ఒక్క రూపాయి అయినా వచ్చిందా?” అని నిలదీశారు.

విజన్ 20 20 పేరుతో గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని పునరుద్ఘాటించారు. చేసిన పనిని  చెప్పుకుంటుంటే వైసీపీ నేతలు దారుణమైన విమర్శలు చేయడం హేయమైన చర్యగా బాబు అభివర్ణించారు జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం పరిపాలన చేస్తూ ఆంధ్రప్రదేశ్ యువతన నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఒక మంచి పని చేస్తే ప్రపంచమంతా పొగుడుతుందని, చెడు చేస్తే ఛీ  కొడతారని అంటూ…తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్న సమయంలో జగన్ గోలిలాట ఆడుతున్నాడేమో అంటూ వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ పై వైసీపీ విమర్శలను బాబు ప్రస్తావిస్తూ… ఆయన హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడితే వైసీపీ బ్యాచ్ రెచ్చిపోతోందని..  కానీ గతంలోనే  మన్మోహన్ సింగ్, బిల్ క్లింటన్, బిల్  గేట్స్ లాంటి వాళ్ళు హైదరాబాద్ గురించి చెప్పారని గుర్తు చేశారు. భారత చలనచిత్ర పరిశ్రమకు మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ మార్కెట్ ని చూపించిన వ్యక్తి రజనీకాంత్ అని… అలాంటి వ్యక్తిపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ప్రజా వేదికను కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నారు. యువత భవిష్యత్తును అంధకారులను పాపం ముమ్మాటికీ జగన్ ప్రభుత్వం దేనిని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్