Sunday, May 19, 2024
HomeTrending NewsNeera Cafe: హైదరాబాద్ లో నీరా కేఫ్ ప్రారంభం

Neera Cafe: హైదరాబాద్ లో నీరా కేఫ్ ప్రారంభం

హైదరాబాదు నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు, నీరా అనుబంధ ఉత్పత్తులైన తేనె, బూస్ట్, షుగర్, బెల్లంలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసిని ప్రవేశపెట్టామన్నరు. తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిదారులు మాత్రమే నీరాను ఉత్పత్తి, అమ్మకాలు జరిపేలా నీరా పాలసి రూపొందించామన్నారు. గీత కార్మికులకు లైసెన్సుల కాలపరిమితిని 5 ఎండ్ల నుండి 10 ఎండ్ల వరకు పెంచడం జరిగిందన్నారు. రైతు భీమా మాదిరిగా గీత కార్మికుల కోసం 5 లక్షల రూపాయల భీమా’ ను కల్పించినందుకు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైన దాదాపు లక్షమంది గీత కార్మికులకు ప్రతి నెల 2016 రూ. ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు.

మద్యం దుకాణాలలో దేశంలో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీ ఎస్టీలకు 15% రిజర్వేషన్లు కల్పించటం సాహసోపేతమైన చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. గీత వృత్తి ప్రోత్సాహం కోసం తెలంగాణకు హరితహారంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల 20 లక్షల తాటి, ఈత మొక్కలు నాటామన్నారు. తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికి వేసే వారిపై చట్టపరమైన కటిన చర్యలు, కేసులు నమోదు చేస్తున్నామన్నారు. తాటి, ఈత చెట్ల రెంటల్ శాశ్వతంగా రద్దు చేశామని వెల్లడించారు. గీత కార్మికుల గత బకాయిలు సుమారు 8 కోట్ల రూపాయలను రద్దు చేశామని గుర్తు చేశారు. గీత వృత్తిలో మరణించిన వారికి గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియాను 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి గతంలో ఇచ్చిన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని 5 లక్షల రూపాయలకు పెంచటం జరిగిందన్నారు.

వందల కోట్ల విలువైన గౌడ ఆత్మగౌరవ భవనానికి 5 ఎకరాల భూమి కేటాయించారాన్నరు. ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించేందుకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోటలను పరిరక్షించి వాటిని పురావస్తు కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే భువనగిరి కోట జాఫర్ ఘడ్ కోట, కిలాషా పూర్ కోట, తాటికొండ కోట, కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం పాపన్నపేట లో ఉన్న సుమారు 400 ఎకరాల కోట గ్రానైట్ మాఫియా నుండి పరిరక్షించామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్