Monday, November 25, 2024
HomeTrending Newsభాగస్వామ్యం కావడం అదృష్టం: చంద్రబాబు

భాగస్వామ్యం కావడం అదృష్టం: చంద్రబాబు

సామాజిక న్యాయానికి తమ పార్టీ మొదటినుంచీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కోవింద్, ఇప్పుడు ద్రౌపది ముర్ము… నలుగురు రాష్ట్రపతుల ఎంపికలో తాము భాగం కావడం అదృష్టంగా భావుస్తున్నామని, ఈ ఐదుగురిలో ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒకరు మైనార్టీ సామాజిక వర్గానికి చెందినవారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము విజయవాడలోని ఓ హోటల్ లో తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపినందుకు తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు ప్రసంగిస్తూ ఓ గిరిజన మహిళా ఈ దేశ ప్రథమ పౌరురాలిగా ఎంపికయ్యే అద్భుత ప్రక్రియలో తామూ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈమెను ఎంపిక చేసిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సిఎం రమేష్, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణ రెడ్డి, పీవీఎన్ మాధవ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్