Saturday, January 18, 2025
HomeTrending Newsపోలీసుల తీరు గర్హనీయం: బాబు ఆగ్రహం

పోలీసుల తీరు గర్హనీయం: బాబు ఆగ్రహం

We Won’t leave: ఈ ప్రభుత్వంలో కొందరు పోలీసుకు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని, మళ్ళీ తాను సిఎం కావడం ఖాయమని… ఆ వెంటనే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇప్పటి వరకూ ఎలాంటి 41(ఎ) నోటీసులు ఇవ్వకుండా 600 మంది టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టారని బాబు విస్మయం వెలిబుచ్చారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన గారపాటి వెంకటేష్, మంగళగిరికి చెందిన సాంబశివరావు లను సిఐడి అధికారులు రోజంతా విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ పేరుతో పోలీసులు హింసించారని బాబు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

విచారణ చేయాలనుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని అదేమీ లేకుండా ఉదయాన్నే గోడలు దూకి మరీ వెళ్లి, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి స్టేషన్ కు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టె అధికారం వీరికి ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ కార్యకర్తలను కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ మర్డర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని… ఇది గర్హనీయమన్నారు. ఒకణ్ణి కొడితే పదిమంది తయారు కావాలని, పదిమందిని కొడితే వందమంది తయారు కావాలని, ఇలా ఎంతమందిని టార్చర్ పెడతారో తానూ చూస్తానని, ఈ విధంగా టార్చర్ పెట్టిన వారిపై కూడా ఏం చేయాలో అది చేద్దామని, న్యాయపోరాటం ద్వారా వారి సంగతేంతో తేలుస్తామని బాబు తేల్చి చెప్పారు.  కేసు విచారణ సందర్భంగా తీసుకోవాల్సిన ప్రొసీజర్ పై హైకోర్టు, సుప్రీం కోర్టులు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా పోలీసులు పాటించడం లేదని విమర్శించారు.

ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలయ్యిందని, తాము నిర్వహించిన బాడుడే బాదుడు, మహానాడు, చోడవరం సభలకు విశేష స్పందన వచ్చిందని, కార్యకర్తలు ధైర్యంగా పోరాడాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు .

Also Readమీ పతనం మొదలైంది: బాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్