Saturday, November 23, 2024
HomeTrending Newsబాంబే హైకోర్టు కీలక తీర్పు... ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్

బాంబే హైకోర్టు కీలక తీర్పు… ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్

మావోయిస్టులతో ప్రొఫెసర్ సాయిబాబాకు సంబంధాలు ఉన్నాయనే కేసులో  బాంబే హైకోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా పట్టుబడిన వారంతా నిర్దోషులని ప్రకటించింది. అంతేకాకుండా వారిపై ఏ కేసులున్నా.. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దాంతో సాయిబాబాకు విముక్తి లభించినట్లైంది. అంగవైకల్యంతో వీల్ చైర్‌కే పరిమితం అయిన ఆయన.. జైల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.  అతడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. 2017లో ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ సాయిబాబా అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది.

అంగవైకల్యం కారణంగా వీల్ చైర్‌లో ఉండే ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. ఈ నేపథ్యంలో ఇతర దోషులు ఏ ఇతర కేసుల్లో నిందితులుగా ఉన్నా వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా “ఆయన ఓ మేధావి పైగా ప్రొఫెసర్.. ఈ కేసులో ఆయన్ని ఇరికించారు. ఏడేళ్లు జైల్లో ఉండడంతో ఆరోగ్యం క్షీణించి, అవయవాలు సరిగా పనిచేయడం లేదు.” అని సాయిబాబా భార్య వసంత కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరీ సాయిబాబా..?
జీఎన్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేశారు. 2003లో రామ్‌లాల్ ఆనంద్ కళాశాలలో 2003లో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. 2014లో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే యూనివర్సిటీ అతనిని సస్పెండ్ చేసింది. 2014లో సస్పెన్షన్‌కు గురైనప్పటి నుంచి అతని కుటుంబం సగం జీతం మాత్రమే పొందుతుంది. అయితే మార్చి 31, 2021న కళాశాల ప్రిన్సిపాల్ సాయిబాబా సేవలను పూర్తిగా రద్దు చేస్తూ మెమోరాండంపై సంతకం చేశారు.

మావోయిస్టులతో సంబంధాలు, దేశానికి వ్యతిరేకంగా చేసే కార్యకలాపాలకు పాల్పడినందుకు సాయిబాబాతో పాటు ఒక జర్నలిస్ట్, జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థితో పాటు ఇతరులను మార్చి 2017లో మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు దోషులుగా నిర్దారించింది. అయితే సాయిబాబాకు ఉన్న అంగవైకల్యం కారణంగానైనా.. బెయిల్ ఇవ్వలేదు. దీనిపై ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఎన్నోసార్లు నిరసన తెలియజేశాయి. అయినా సరే న్యాయస్థానం కఠినంగానే వ్యవహరించింది. అలాంటిది ఈ కేసులో బాంబే హైకోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది. అందరిని నిర్దోషులుగా తేల్చింది. పైగా అందరిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై ప్రజాస్వామిక వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్