Saturday, January 18, 2025
Homeసినిమాఆ టైటిల్ కే బాలయ్య ఓకే చెప్పారా..?

ఆ టైటిల్ కే బాలయ్య ఓకే చెప్పారా..?

బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ సినిమా పై మరింత క్రేజ్ ను పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చితాన్ని సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అయితే.. ఈ సినిమా తర్వాత బాలయ్య.. అనిల్ రావిపూడితో భారీ చిత్రం చేయనున్నారు. ఈ మూవీని ఎప్పుడో ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రధానంగా నడిచే కథ ఇది. కూతురు పాత్రకిగాను ఆల్రెడీ శ్రీలీల ఎంపిక జరిగిపోయింది. కథానాయిక ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇక అసలు విషయానికి వస్తే… ఈ సినిమాకి రామారావు గారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఈ  టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ కథను బాలయ్యకు అనిల్ ఎప్పుడో చెప్పారు. అలాగే టైటిల్ కూడా చెప్పారు. కథ, టైటిల్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇందులో బాలయ్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అయితే.. రామారావు గారు అనే టైటిల్ నే పెడితే మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. త్వరలోనే టైటిల్ ను అనౌన్స్ చేస్తారేమో చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్