Sunday, January 19, 2025
Homeసినిమాఅఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహ’, ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఆతర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘అఖండ’. దీంతో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. సింహా, లెజెండ్ చిత్రాలకు మించి.. ఇంకా చెప్పాలంటే.. బాలయ్య కెరీర్ లోనే అత్యథిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అదీ కూడా కరోనా తర్వాత జనాలు థియేటర్లకు వస్తారా..?  రారా..? అనుకుంటున్న టైమ్ లో ఈ రేంజ్ సక్సెస్ సాధించడం విశేషం.

అయితే.. అఖండ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత బోయపాటి ‘అఖండ 2’ తీస్తామని ప్రకటించారు. అఖండ మూవీ క్లైమాక్స్ లో అఖండ 2 ఉంటుందనే హింట్ ఇచ్చారు. దీనికి తగ్గట్టు బోయపాటి అలా ప్రకటించడంతో ఎప్పుడెప్పుడు అఖండ 2 గురించి అప్ డేట్ వస్తుందా అని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. అఖండ 2 గురించి బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు, బోయపాటి శ్రీను రామ్ హీరోగా ఒక సినిమా తీస్తున్నారు.

మరి మళ్ళీ వీరి కాంబినేషన్ ఎప్పుడు సాధ్యమవుతుంది? చాలా టైమ్ పట్టచ్చు అఖండ 2 సెట్స్ పైకి రావడానికి అనుకుంటుంటే… త్వరలోనే ఉంటుంది. అఖండ 2 కూడా గురించి చర్చించాం. అన్నీ ఒక కొలిక్కి వచ్చాక అఖండ 2 ప్రకటిస్తాం అని నందమూరి బాలకృష్ణ తెలిపారు. అఖండ సినిమాని గోవాలో జరుగుతున్న ఇఫిలో ప్రదర్శించారు. గోవాకి వెళ్లిన బాలకృష్ణ, బోయపాటి మీడియాతో ముచ్చటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ బాలయ్య ఇలా అఖండ 2 పై క్లారిటీ ఇవ్వడం ఆసక్తిగా మారింది. మరి.. అఖండ 2 తో కూడా బాలయ్య, బోయపాటి కలిసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.

Also Read పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో అఖండ 2?

RELATED ARTICLES

Most Popular

న్యూస్