Wednesday, September 25, 2024
Homeసినిమాబాలకృష్ణ మూవీ టైటిల్ 'వీరసింహా రెడ్డి'

బాలకృష్ణ మూవీ టైటిల్ ‘వీరసింహా రెడ్డి’

బాలకృష్ణ, మలినేని కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘#NBK107‘ కి పవర్ ఫుల్ టైటిల్ ఖరారైయింది. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్‌ను వేలాది మంది అభిమానుల సమక్షంలో భారీగా లాంచ్ చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజు పై 3డి టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.

ఈ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ యాప్ట్ టైటిల్. సింహా పేరుతొ బాలకృష్ణ చేసిన మెజారిటీ సినిమాలు భారీ బ్లాక్‌ బస్టర్‌ లుగా నిలిచాయి. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. పోస్టర్ పై గర్జించే సింహం బాలకృష్ణ క్యారెక్టర్ ని ప్రతిబింబిస్తుంది. టైటిల్ పోస్టర్ లో బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో వేటకు సిద్ధమైన సింహంలా కనిపిస్తున్నారు.

పులిచెర్ల 4 కిలోమీటర్ల మైల్ స్టోన్ కనిపిస్తోంది. టైటిల్ పోస్టర్ సినిమా  పై భారీ బజ్ పెంచింది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్‌ హంట్‌ కి భారీ స్పందన వచ్చింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు నిర్మాతలు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్