Saturday, January 18, 2025
Homeసినిమాసంక్రాంతి బ‌రిలో బాల‌య్య‌?

సంక్రాంతి బ‌రిలో బాల‌య్య‌?

Dasara-Sankranthi:  నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజ‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమా పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ ఈ మూవీని ద‌స‌రాకి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌.. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తో భారీ చిత్రం చేయ‌నున్నారు. ఇటీవ‌ల బాల‌య్య పుట్టిన‌రోజున ఈ మూవీని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. బాల‌య్య 108వ సినిమాగా ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఆగ‌ష్టు నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేక‌ర్స్.

ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని అనిల్ రావిపూడి చెప్పాడు. కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని అన్నాడు. కథానాయికలుగా ప్రియమణి, మెహ్రీన్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌రు అనేది ఫైన‌ల్ చేయ‌నున్నారు. వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. బాల‌య్య‌తో అనిల్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read : ద‌స‌రా బరిలో చిరు, బాలయ్య? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్