Elements: సాయిపల్లవి ప్రధానమైన పాత్రను పోషించిన ‘విరాటపర్వం‘ సినిమా విడుదల తేదీకి చాలా దగ్గరగా వచ్చేసింది. రానా కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన థియేటర్లలో దిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనుండగా, ఆయనను ఆరాధించే గ్రామీణ యువతిగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె మేకప్ లేకుండా కనిపించనుండటం విశేషం.

చాలాకాలం క్రితమే ఈ సినిమా పూర్తయినప్పటికీ, సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. చివరికి అలాంటి డేట్ దొరికిందనే చెప్పుకోవాలి. ఈ నెల 17వ తేదీన ‘విరాటపర్వం’తో పాటు సత్యదేవ్ ‘గాడ్సే’ మాత్రమే రిలీజ్ అవుతోంది. సత్యదేవ్ మంచి ఆర్టిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎందుకో ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అంతగా బజ్ లేదు. సాయిపల్లవి – రానా క్రేజ్ కారణంగా ‘విరాటపర్వం’ సినిమా వైపు మొగ్గుచూపుతున్నవారి సంఖ్య ఎక్కువగా  కనిపిస్తోంది. వేణు ఉడుగుల ఎంచుకున్న కథాంశంపై ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఉండటం కూడా అందుకు ఒక కారణమై ఉండొచ్చు.

ఇక ‘విరాటపర్వం’ సినిమాకి పోటీగా దగ్గరలో మరో సినిమా లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. వచ్చేవారం .. అంటే ఈ నెల 24వ తేదీన దాదాపు అరడజను సినిమాలు విడుదలవుతున్నాయి. కంటెంట్ పరంగా చూసుకున్నా .. ఆర్టిస్టుల క్రేజ్ పరంగా చూసుకున్నా ‘విరాటపర్వం’ సినిమాకి పోటీ ఇచ్చేవిగా ఏవీ కనిపించడం లేదు. సినిమాలో ఏ మాత్రం విషయం ఉన్నా, మంచి వసూళ్లు రాబట్టడానికి అవసరమైనంత సమయం ఉంది. ఈ సినిమా హిట్ అయితే సాయిపల్లవికి హ్యాట్రిక్ హిట్  పడుతుందనే ఆశతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Also Read సాయిప‌ల్ల‌వి ఆకాశానికి ఎత్తేసిన వెంకీ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *