టిబెట్, జింజియాంగ్ ప్రావిన్స్ లలో చైనా పాలకుల కుట్రలు మరింతగా పెరుగుతున్నాయి. అభివృద్ధి పేరుతో రెండు రాష్ట్రాల్లో స్థానికుల సంస్కృతిని దెబ్బతీసే కుట్రలు పెరిగాయి. టిబెట్ రాజదాని లాసాలో ఇప్పటికే అనేక చైనా కంపెనీలు అభివృద్ధి పేరుతో అక్కడి రూపు రేఖలనే మార్చాయి. లాసా చిహ్నంగా ఉన్న పొటాలా రాజభవనం తప్పితే నగరంలో టిబెటన్ సంస్కృతి కనిపించటం లేదు. అన్ని మాండరిన్ బాషలోనే దర్శనమిస్తున్నాయి. స్థానికులు కూడా మాండరిన్ నేర్చుకోవాలని సైనిక వర్గాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. సైన్యంలో చేరాలని, మాండరిన్ నేర్చుకోవాలని హింసిస్తున్నారు. తమ మాట వినని వారిని నిర్భంద క్యాంపులకు తరలిస్తున్నారు. ప్రజాస్వామిక హక్కుల కోసం ఎవరు మాట్లాడినా వారిని ఏదో ఒక నెపంతో జైల్లో వేయటం పరిపాటిగా మారింది.

మరోవైపు జింజియాంగ్ లో వుయ్ఘుర్ ముస్లింలను  రీ ఎడ్యుకేషన్ పేరుతో మాండరిన్ నేర్చుకోవాలని లేదంటే దేశద్రోహుల నెపంతో నిర్భంద క్యాంపులకు తరలిస్తున్నారు. మహిళలకు గర్భనిరోధక చికిత్సలు చేసి వుయ్ఘుర్ జనాభా పెరగకుండా కుట్ర చేస్తున్నారు. జనాభాలో అత్యధిక శాతం పురుషులకు కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు ఇప్పటికే చేశారు. చైనా పాలకుల మాట వినని వారి పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి విద్య పేరుతో సుదూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. తష్కుర్గాన్ లో విమానాశ్రయం నిర్మించటం చర్చనీయంశంగా మారింది. అది మిలిటరీ అవసరాల కోసమా… పౌర సేవల కోసమా తెలియాల్సి ఉంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయం 3,258 మీటర్ల ఎత్తులో నిర్మించటం గమనార్హం. గత కొంత కాలంగా ప్రపంచ దేశాలు జింజియాంగ్ ప్రజల తరపున మాట్లాడటం చైనా పాలకులకు కంటగింపుగా మారింది. ప్రపంచం దృష్టిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి… ఎలాంటి నిరసనలు చేపట్టినా త్వరితగతిన మిలిటరీ అక్కడికి చేరుకొని కట్టడి చేసేందుకే తష్కుగాన్ విమానాశ్రయం నిర్మించారని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.

Also Read : తాలిబన్లను మించిన చైనా పాలకులు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *