Saturday, January 18, 2025
Homeసినిమాటెన్షన్ లో బాలయ్య ఫ్యాన్స్..?

టెన్షన్ లో బాలయ్య ఫ్యాన్స్..?

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత వస్తున్న బాలయ్య సినిమా కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అఖండ, వీరసింహారెడ్డి, అనిల్ రావిపూడితో సినిమా… ఇలా భారీ యాక్షన్ మూవీస్ లో నటిస్తున్న బాలకృష్ణ ఈసారి రూటు మార్చి ఆథ్యాత్మిక చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యారట. స్వామి రామానుజాచార్య జీవిత చరిత్రను బాలకృష్ణతో తీయనున్నట్టుగా సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ తెలియచేశారు. సి.కళ్యాణ్ ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి బాలయ్య అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. కారణం ఏంటంటే… మాస్ హీరో అయిన బాలకృష్ణకు అలాంటి సినిమాలు అసలు సూట్ అవ్వవని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అదీగాక ఆ సినిమా నిర్మాత సి కళ్యాణ్ అనేసరికి ఫ్యాన్స్  మరింత కంగారు పడుతున్నారు. ఆయనతో తీసిన సినిమాలన్ని పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అందుకే బాలకృష్ణ ఈ మూవీ ఆలోచనని పక్కన పెట్టేస్తే బెటర్ అని అంటున్నారు. అయితే.. బాలయ్య ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోరు. మరి.. నిజంగా బాలయ్య ఈ సినిమా చేస్తారా..?  చేస్తే ఎవరు ఈ మూవీని డైరెక్ట్ చేస్తారో చూడాలి.

Also Read :  బాలకృష్ణతో ‘రామానుజాచార్య’ బయోపిక్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్