Sunday, January 19, 2025
Homeసినిమాఆదిత్య 369 సీక్వెల్ పై బాలయ్య క్లారిటీ

ఆదిత్య 369 సీక్వెల్ పై బాలయ్య క్లారిటీ

ఆదిత్య 369.. బాలయ్య కెరీర్ లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఇదొకటి. కారణం ఏంటంటే.. టైమ్ మిషన్ నేపధ్యంలో తెలుగులో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. ఈ కథ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అందుకనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అయితే.. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ఉందని బాలయ్య  స్వయంగా చెప్పారు కూడా. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ స్టార్ట్ అవుతుందా అని బాలయ్య అభిమానులు ఎదురు చూశారు.

ఆదిత్య 369 చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఆయనే సీక్వెల్ ‘ఆదిత్య 999’ డైరెక్ట్ చేయాలనుకున్నారు. కథ రెడీ చేయడం.. బాలయ్యకు చెప్పడం జరిగింది. బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దీనిలో  నందమూరి మోక్షజ్ఞతో గెస్ట్ రోల్ చేయించాలి అనుకున్నారు. ఆవిధంగా మోక్షజ్ఞని ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలి అనుకున్నారు కానీ.. ఇంత వరకు అప్ డేట్స్ లేవు. ఒకానొక టైమ్ లో ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తానని బాలయ్య వెల్లడించారు.

అయితే.. చాలా రోజులు నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని బాలయ్య ఇప్పుడు అప్ డేట్ ఇచ్చారు. అన్ స్టాపబుల్ 2 టాక్ షాలో గెస్ట్ లుగా అడివి శేష్, శర్వానంద్ పాల్గొన్నారు. ఈ టాక్ షోలో బాలయ్య మాట్లాడుతూ… ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చేయబోతున్నానని ప్రకటించారు. అంతే కాకుండా.. ఈ సినిమాను 2023లో సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారా..?  లేక బాలయ్యే దర్శకత్వం వహిస్తారా అనేది తెలియాల్సివుంది. మరి.. ఆదిత్య 369 సీక్వెల్ తో కూడా బాలయ్య మెప్పిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్