Sunday, January 19, 2025
Homeసినిమాబాల‌య్య 107 రిలీజ్ డేట్ ఫిక్స్?

బాల‌య్య 107 రిలీజ్ డేట్ ఫిక్స్?

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ కాంబినేష‌న్లో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ రూపొదుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అఖండ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన‌ బాలయ్య లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ  భారీ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అయితే.. బాలయ్యకి కరోనా రావడం వలన షూటింగు వాయిదా పడింది. బాల‌య్య‌తో పాటు ఈ సినిమాలో న‌టిస్తున్న కొంత మందికి క‌రోనా రావ‌డంతో షూటింగ్ బాగా ఆల‌స్యం అయ్యింది.

అందువ‌ల‌న ఈ భారీ చిత్రం ద‌స‌రాకి రిలీజ్ కావ‌డం లేదు. బాలయ్య ఇంతకు ముందు చేసిన అఖండ చిత్రం డిసెంబర్ 2వ తేదీన విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సొంతం చేసుకుంది. అదే సెంటిమెంట్ తో అదే రోజున ఈ భారీ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేక‌ర్స్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. మ‌రి.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి ఈ మూవీ కూడా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్