Sunday, January 19, 2025
Homeసినిమాకళ్యాణ్ రామ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ

కళ్యాణ్ రామ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ

బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంతో వంద చిత్రాలు పూర్తి చేశారు. సెంచరీ చేసిన తర్వాత ఎవరైనా కాస్త స్పీడు తగ్గిస్తారు కానీ.. బాలయ్య సెంచరీ తర్వాత మరింత స్పీడు పెంచారు. ఇటీవల ‘అఖండ’ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ అంటూ వస్తున్నారు. ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా తర్వాత బాలయ్య.. అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ డైరెక్టర్ కి ఓకే చెప్పారంటే.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన మల్లిడి వశిష్ట్ అని టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ అనే సక్సెస్‌లో లేని హీరోను పెట్టి పెద్ద బడ్జెట్లో అతను తీసిన ఈ సోషియో ఫాంటసీ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ ‌బస్టర్‌గా నిలిచింది. తొలి సినిమాకు కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకుని ఎంతో జనరంజకంగా దాన్ని తీర్చిదిద్దిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఇండస్ట్రీలో వశిష్ఠ్‌కు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. ఆల్రెడీ బింబిసార-2 పనుల్లో ఉన్న అతడితో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

అతను ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేయడానికి ప్రయత్నం చేయడం చర్చనీయాంశం అయింది. ఇదేమీ రూమర్ కూడా కాదు. నిజంగానే రజినీని కలిసి వశిష్ఠ్ ఒక కథను నరేట్ చేశాడు. రజినీ కూడా సానుకూలంగానే స్పందించాడు కానీ.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో మాత్రం తెలియదు. కాగా వశిష్ట్.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తెలిసింది. కళ్యాణ్‌ రామ్‌తో క్లోజ్‌గా ఉండే బాలయ్యకు.. వశిష్ఠ్ ఒక లైన్ చెప్పాడని.. ఆయనకు నచ్చిందని, తనకున్న కమిట్మెంట్లు పూర్తయ్యాక సినిమా చేస్తానని బాలయ్య మాట ఇచ్చినట్లు సమాచారం. మరి.. బాలయ్యను వశిష్ట్ ఎలా చూపిస్తారో. ఏ తరహా కథతో సినిమా చేస్తాడో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్