Sunday, January 19, 2025
HomeసినిమాBalayya: బాలయ్య పాన్ ఇండియా మూవీ!

Balayya: బాలయ్య పాన్ ఇండియా మూవీ!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరాకి విడుదల కానుంది.  దీని తర్వాత బోయపాటితో బాలయ్య  ఓ సినిమా చేయనున్నారు. దీంతో పాటు బాబీకి కూడా  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

అయితే.. బాలయ్య ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారని.. ఇది భారీ మల్టీస్టారర్ అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ మల్టీస్టారర్ లో నటించే హీరో ఎవరంటే.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అని తెలిసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. బాలకృష్ణతో కలిసి నటించబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుందని.. ఫస్ట్ పార్ట్ లో బాలకృష్ణతో పాటు రజనీకాంత్ నటించనున్నారని.. సెకండ్ పార్ట్ లో బాలకృష్ణతో పాటు శివ రాజ్ కుమార్ కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

ఈ రెండు పార్ట్ ల షూటింగ్ ను ఒకే సారి పూర్తి చేసి ఆరు నెలల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాకు గాను కన్నడ ప్రముఖ ఫిల్మ్ మేకర్ దర్శకత్వం వహించనున్నారని.. ఈ భారీ పాన్ ఇండియా మూవీని శివ రాజ్ కుమార్ నిర్మిస్తారని టాక్. బాలయ్య, శివ రాజ్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది అంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. ఈ భారీ మల్టీస్టారర్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్