Sunday, January 19, 2025
HomeసినిమాNanadmuri Balakrishna: బాలయ్య నెక్ట్స్ మూవీ ఎవరితో..?

Nanadmuri Balakrishna: బాలయ్య నెక్ట్స్ మూవీ ఎవరితో..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరో వైపు అనిల్ రావిపూడి పటాస్ నుంచి ఎఫ్ 3 వరకు అపజయం అనేది లేకుండా వరుస సక్సెస్ లు సాధించారు. వీరిద్దరూ చేస్తున్న ఈ సినిమా కూడా విజయం సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది.

దసరాకి విడుదల చేయనున్న ఈ సినిమా టైటిల్  త్వరలో ప్రకటించనున్నారు. అయితే. దీని తర్వాత బాలయ్య చేసే సినిమా ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు కానీ.. బోయపాటితో అని వార్తలు వస్తున్నాయి. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ సాధించిన బాబీతో కూడా బాలయ్య సినిమా చేయనున్నారని.. అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా తర్వాత బాబీతోనే సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం బాబీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారని.. త్వరలోనే ఈ సినిమా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది.

దీంతో బాలయ్య నెక్ట్స్ మూవీ బోయపాటితోనా..? బాబీతోనా..? అనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య నెక్ట్స్ మూవీని బోయపాటి శ్రీనుతో చేయనున్నారట. ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న ప్రకటించాలని అనుకుంటున్నారట. అయితే.. బోయపాటితో సినిమా చేస్తూనే బాబీతో కూడా సినిమా చేయాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారని తెలిసింది. మరి.. త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్