Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రజలే బుద్ధి చెబుతారు: బాలినేని

ప్రజలే బుద్ధి చెబుతారు: బాలినేని

హుజురాబాద్ ఉపఎన్నికల్లో లబ్ధికోసమే కొందరు తెలంగాణ నేతలు వైఎస్సార్ పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇలాంటి నేతలకు తెలంగాణ ప్రజలే తగిన బుద్ధిచెబుతారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలను సమానంగా చూసిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు. సమైక్యరాష్ట్రంలో వైఎస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.

వైస్సార్ 72 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం పని చేసిన నాయకుడు వైఎస్సార్ అని, జలయజ్ఞం చేపట్టి నీటిప్రాజెక్టులు చేపట్టిన అపర భగీరథుడని అభివర్ణించారు. అలాంటి నేతను పరుష పదజాలంతో దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక  ప్రాజెక్టులను మొదలు పెట్టి పూర్తిచేసిన ఘనత రాజశేఖరరెడ్డికి దక్కుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్