Sunday, January 19, 2025
HomeTrending Newsప్రీతిది ముమ్మాటికీ హత్యే...బండి సంజయ్

ప్రీతిది ముమ్మాటికీ హత్యే…బండి సంజయ్

‘‘కేసీఆర్… మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్ధి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నారు?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎంజీఎం ఆసుపత్రిలోనే ప్రతి చనిపోయిందని… నిందితుడు సైకోను కాపాడేందుకు డెడ్ బాడీని ఎత్తుకుపోయి నిమ్స్ లో చికిత్స చేస్తున్నట్లుగా డ్రామా చేశారని మండిపడ్డారు. డెడ్ బాడీ థంబ్ ద్వారా ప్రీతి మొబైల్ లాక్ ను ఓపెన్ చేసి ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. పోలీసులారా… మీ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే.. ఇదే విధంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.

జనగాం జిల్లాలోని గిర్ని తండాలో ప్రీతి కుటుంబాన్ని బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బండి సంజయ్ తోపాటు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్; పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ తదితరులు ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రీతి మరణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

• గత 7 రోజుల క్రితం ఎంజీఎంలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూపారు. సైఫ్ అనే వ్యక్తి ర్యాగింగ్ చేసినట్లుగా చెప్పడం, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా స్పందించకుండా కాలేజీ హెచ్ఓడీ ప్రీతినే బెదిరించడం చూశాం.

• ప్రీతి ఆత్మహత్య చేసుకునే పరికితనం ఉన్న అమ్మాయి కాదు. నిర్మొహమాటంగా చెప్పే అలవాటుందని ఆమె ఫ్రెండ్స్ చెప్పారు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. ఆధారాలన్నీ చెరిపేశారు. లాక్ ఉన్నమొబైల్ ను ఎట్లా ఓపెన్ చేస్తారు?

• నిందితుడికి అనుకూలంగా వ్యవహరించారు. నిందితుడి వల్ల మత కల్లోలాలు వస్తాయనే భయపడ్డట్లున్నరు. ప్రీతిది హత్యే… ఆత్మహత్య కాదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మేం డిమాండ్ చేశారు.

• ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపితే ప్రీతి చనిపోయేది కాదు. నిందితుడి సైఫ్ పక్షాన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండటం సిగ్గు చేటు. సీఎంకు సిగ్గు లేదు.

• విద్యార్థులు, రాజకీయ నేతలు స్పందిస్తారని భయపడి… చనిపోయిన డెడ్ బాడీని నిమ్స్ కు తీసుకెళ్లి దొంగ ట్రీట్ మెంట్ చేశారు. డెడ్ బాడీని ఎత్తుకుపోయే చిల్లర సంస్కృతికి కేసీఆర్ ప్రభుత్వం తెరదీసింది.

• కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లే చేయాలట. వాళ్లకు కనీసం సెంటిమెంట్ లేదు. తొందరగా డెడ్ బాడీని ఖననం చేసి చేతులు దులుపుకోవాలని చూశారు.

• కేసీఆర్ కొడుకుకు కండ కావరం ఎక్కింది. బలుపెక్కి మాట్లాడుతున్నడు. ప్రీతి ఘటనపై ఎందుకు స్పందించలేదు? ప్రతి దానికి ట్వీట్ చేస్తావ్ కదా… హోంమంత్రి అసలున్నాడా? పాతబస్తీకే పరిమితమైండు.

• చనిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చి థంబ్ పెట్టి మొబైల్ లాక్ ఓపెన్ చేశారంటే వీళ్లు ఎంతటి దుర్మార్గులో అర్ధమవుతోంది. ప్రీతి ఎలా చనిపోయిందో ఇప్పటికీ పూర్తిగా పోలీసులు వాస్తవాలు వెల్లడించలేదు.

• పోలీసులూ… మీకు కుటుంబాలున్నాయి? మీ వాళ్లకు ఇట్లా జరిగితే ఇలానే వ్యవహరిస్తారా? పేదోళ్ల బతుకులకు న్యాయం ఉండదా?

• ప్రీతి ఘటనకు నిరసనగా వాస్తవాలు తెలియజేయాలని బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేశారు.

• మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నాం.

• కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా న్యాయ పోరాటం చేస్తాం. కేసీఆర్ కు ఎస్టీలంటనే చులకన. విద్యార్థులు, అమ్మాయిలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు. పోడు భూముల సమస్య పరిష్కరించడు. గిరిజన రిజర్వేషన్లు అమలు చేయడం లేదు.

• కేసీఆర్… మీకు తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిపై కఠినంగా ఎందుకు శిక్షించడం లేదు? ప్రీతి తరపున పోరాడే విద్యార్థులను ఎందుకు బెదిరిస్తున్నవ్? బిడ్డా… మీకు రోజులు దగ్గర పడ్డయి. ఇంకెన్నాళ్లు ఈ అరాచకాలు చేస్తారో చూస్తాం..

RELATED ARTICLES

Most Popular

న్యూస్