Sunday, January 19, 2025
HomeసినిమాDevara: ఎన్టీఆర్ మూవీకి పవన్ టైటిల్ పెట్టారా..?

Devara: ఎన్టీఆర్ మూవీకి పవన్ టైటిల్ పెట్టారా..?

పవన్ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. ఆతర్వాత నుంచి పవన్, బండ్ల గణేష్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. పవన్ కళ్యాణ్‌ నా దేవుడు అంటూ బండ్ల గణేష్ టైమ్ కుదిరినప్పుడల్లా ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. మళ్లీ పవన్  తో సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. పవన్ ని బండ్ల గణేష్ దేవర అని పిలుస్తుంటాడు. దేవర అనే టైటిల్ ను పవన్ కోసం రిజిస్టర్ చేయడం కూడా జరిగింది.

అయితే… టైటిల్ కొంత కాలం అయిన తర్వాత రెన్యూవల్ చేయించుకోవాలి. బండ్ల గణేష్ రెన్యూవల్ చేయించడం మరిచిపోయాడు. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల సినిమాకి ఈ టైటిలే పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ దేవర అనే టైటిల్ ను తాను రిజిష్టర్ చేయించాను. తను మర్చిపోవడం వలన టైటిల్ ను కొట్టేశారు అని కామెంట్ చేశాడు. మరొక ట్వీట్ లో నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా, ఆయన కూడా నాకు దేవరే అని అన్నారు. దేవర టైటిల్ గురించి బండ్ల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న దేవర టైటిల్ ను పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. కళ్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరంలో ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. మరి.. కొరటాల ఈ సినిమాతో ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్