Bangladesh won Series With 2-1 In Disable Cricket :
హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఇండియా – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన డిసేబుల్ క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 41 పరుగుల తేడాతో ఇండియాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 152 పరుగులు చేయగా, ఇండియా టీమ్ 111 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడు టీ 20 మ్యాచుల సిరీస్ ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. విజేత బంగ్లాదేశ్ జట్టుకు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ట్రోఫీ ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు ఆఫ్ డిసబెల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మమ్మద్ అలీ ఖురేషీ, ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, అన్వర్, స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణా అధికారులు సుజాత, ధనలక్ష్మి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also read :కోల్ ఇండియాతో సమన్వయం: సిఎం సూచన