Tuesday, April 16, 2024
HomeTrending Newsబాసర ట్రిపుల్ ఐటీని ఆధునీకరిస్తాం - మంత్రి కేటిఆర్

బాసర ట్రిపుల్ ఐటీని ఆధునీకరిస్తాం – మంత్రి కేటిఆర్

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్తునుల కోసం ప్రత్యేకంగా  ఆస్పత్రి, వైద్యులను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటిఆర్ ప్రకటించారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. నిర్మల్ జిల్లా బాసరలో ఈ రోజు జరిగిన బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదవ స్నాతకోత్సవానికి మంత్రులు  కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నత విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తున్నామని, భవిష్యత్తులో అపారమైన అవకాశాలను అందించే డిజిటైజేషన్, డీకార్బనైజేషన్ మరియు డీసెంట్రలైజేషన్ (3D) పై దృష్టి పెట్టాలని పట్టభద్రులను మంత్రి కోరారు. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడించారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్‌ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు.
ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్నామని మంత్రి కేటిఆర్ అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్‌టాప్‌లు అందిస్తున్నామని చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీని ఆధునీకరిస్తున్నామని,  ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ముఖ్యమని చెప్పారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్‌ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి మనం ఎదగాలని చెప్పారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
సెప్టెంబరు, 2022లో బాసర ఆర్జికేయూటీకి విచ్చేసి విద్యార్థులకు చేసిన వాగ్దానం మేరకు మంత్రి కేటీఆర్ ఈరోజు బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదవ స్నాతకోత్సవంలో తన సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లతో కలిసి లాంఛనంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, P1 & P2 విద్యార్థులకు డెస్క్ టాప్ లు అందజేశారు. మొత్తం 2,200 ల్యాప్ టాప్ లు మరియు 1,500 డెస్క్ టాప్ కంప్యూటర్లు ఇందుకోసం సిద్ధంచేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్