Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో కళాకారులకు ప్రోత్సాహం

తెలంగాణలో కళాకారులకు ప్రోత్సాహం

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సావిత్రిబాయ్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రవేట్ టీచర్లు లకు గ్లోబల్ టీచర్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట గ్రహీతలు , శారదా కథలు పాడే అరుదైన కళాకారులు జంగమ్మ, శివమ్మ లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అరుదైన కళలను గుర్తించి, కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు.

అంతకుముందు  మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ MD మనోహర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కళాకారులు, పలువురు మహిళలు పాల్గొన్నారు.

మరోవైపు సూర్యపేటలో బతుకమ్మ సంబరాలకు మహిళలు సిద్దమవుతున్నారు. విద్యుత్ శాఖ మంత్రి క్యాంప్ ఆఫీస్ లో తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చిన మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లలితా ఆనంద్,పట్టణమహిళా కొన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్