Thursday, May 30, 2024
Homeస్పోర్ట్స్BCCI: అండర్ 19 విజేతలకు సత్కారం

BCCI: అండర్ 19 విజేతలకు సత్కారం

గతవారం జరిగిన ఐసిసి అండర్ 19 మహిళల టి 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన యువ జట్టును బిసిసిఐ ఘనంగా సన్మానించింది.  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టి 20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జట్టు సభ్యులను సత్కరించారు. బిసిసిఐ  అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశిష్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.  జట్టుకు బిసిఐఐ ఐదు కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని సభ్యులకు, సహాయక సిబ్బందికి అందజేశారు.  జట్టుకు సారధ్యం వహించిన షఫాలీ వర్మను అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్