Thursday, January 23, 2025
Homeస్పోర్ట్స్29న బిసిసిఐ కీలక భేటి

29న బిసిసిఐ కీలక భేటి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రత్యేక సమావేశం ఈ నెల 29న జరగనుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో ఈ ఏడాది క్రికెట్ సీజన్ పై సమావేశంలో చర్స్తిస్తామని బిసిసిఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. సమావేశం గురించి ఇప్పటికే రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చారు.

అక్టోబర్-నవంబర్ లో జరిగే టి-20 ప్రపంచ కప్ కు మన దేశం ఆతిధ్యం ఇస్తోంది. కోవిడ్ రెండో దశ మన దేశాన్ని అతలాకుతలం చేసున్న నేపధ్యంలో టోర్నీ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకే బిసిసిఐ హడావుడిగా సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 1 న ఐసిసి సమావేశం జరగబోతోంది, దీనిలో టి-20 వేదికపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ భేటికి ముందే బిసిసిఐ సమావేశమై పరిస్థితిని సమీక్షించి తన నిర్ణయాన్ని ఐసిసికి తెలియజేయనుంది.

కోవిడ్ వల్ల ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితుల్లో… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో టి -20 టోర్నీ నిర్వహించాలనే ప్రతిపాదనని ఐసిసి ఇప్పటికే పరిగణనలోకి తీసుకుంది. దీనిపై జూన్ 1వ తేదీన స్పష్టత రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్