Sunday, January 19, 2025
HomeTrending Newsబీసీలంటే పనిముట్లు కాదు..బీసీలంటే వెన్నెముక - సిఎం జగన్

బీసీలంటే పనిముట్లు కాదు..బీసీలంటే వెన్నెముక – సిఎం జగన్

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్ బోన్ కాస్ట్.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని నిరూపించామన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.  భారతీయ సమాజానికి వెన్నెముకలు బీసీలని.. గతంలో బీసీలు వెనుకబడిపోయారన్నారు. వాళ్ల పరిస్థితులు మార్చాలని.. తన పాదయాత్రలో 139 బీసీ కులాలను కలిసిన తర్వాత వారి కష్టాలు, నష్టాలు అన్నీ చూశానన్నారు. ఆ తర్వాత వారి ఆశలను, ఆకాంక్షలను తెలుసుకున్న తర్వాత 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించామని గుర్తు చేశారు.

విజయవాడలో ఈ రోజు నిర్వహించిన జయహో బిసీ బహిరంగ సభలో పాల్గొన్న సిఎం జగన్… వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర నలమూలల నుంచి వచ్చిన బీసీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాజకీయ సాధికారతతో గ్రామం నుంచి రాజధానుల వరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల జనసముద్రం ఈ సభ అన్నారు. మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితో పాటూ వార్డు మెంబర్ల వరకు బీసీ కుటుంబం జన సముద్రంలా ఉందన్నారు. 82వేలమంది బీసీలు రాజకీయ సాధికారతతో పదవుల్లో ఉన్నారని.. ‘మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు’ ఉన్నారన్నారు.

బీసీలంటే ఇస్త్రీ పెట్టలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదని చంద్రబాబుకు చెప్పాలన్నారు. 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు 114 వాగ్థానాలు ఇచ్చి అందులో పదిశాతం కూడా అమలు చేయని ఆయనకు చెప్పాలన్నారు. తాము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని చెప్పాలన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం.. ఇప్పుడున్న ప్రభుత్వం మాది, మనది అని చెప్పాలన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ దగాను గుర్తు చేయాలన్నారు. గతంలో ఇలా ఇచ్చిన హామీలను గుర్తు చేయాలన్నారు. బీసీలను చంద్రబాబు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల హామీలు అమలు చేయాలని మత్స్యకారులు అడిగితే ఖబడ్దార్ అంతు చూస్తానని చంద్రబాబు హెచ్చరించిన మాటల్ని.. నాయీ బ్రాహ్మణులు హామీలు నెరవేర్చమని అడిగితే తోకలు కత్తిరిస్తానని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో హామీలను ఎలా అమలు చేశామో గమనించాలని కోరారు. బీసీ కులాలకు ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం.. చరిత్రలో ఎవరూ చేయని విధంగా 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.

బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన చట్టం చేస్తామని చెప్పాం.. నామినేటెడ్ పదవుల్లో 50శాతం బీసీలకు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పాం.. చట్టం చేసి నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారన్నారు. నామినేషన్ వర్కుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చామని.. దానిని నిలబెట్టుకున్నామన్నారు. లక్షా 63వేల కోట్లు ఖర్చు చేశామని.. వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇది అన్నారు జగన్.

ప్రతి పార్టీకి ఓ పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుందని.. వైఎస్సార్‌సీపీకి ఓ ఫిలాసఫీ ఉందన్నారు. మన ఫిలాసఫీ పార్టీ మేనిపెస్టోలో కనిపిస్తుందని.. మేనిఫెస్టోలో ఆత్మ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే ఉన్నారన్నారు. నవరత్నాల పాలనకు అర్ధం ఇంటింటికి గడపగడపకు అందే సామాజిక న్యాయమే, సాధికారితగా వ్యాఖ్యానించారు. ఆర్థిక సాధికారత, రాజకీయ సాధికారత, సామాజిక సాధికారత, మహిళా సాధికారత, విద్యా సాధికారత చూసి మన అందరి ప్రభుత్వం జయహో బీసీ అంటూ చరిత్రలో వేయని విధంగా అడుగులు ముందుకు వేశామన్నారు.

Also Read : జయహో బీసీ మహాసభ… ముస్తాబైన విజయవాడ  

RELATED ARTICLES

Most Popular

న్యూస్