Monday, May 20, 2024
HomeTrending Newsబీసీలు ఐక్యంగా ఉండాలి: విజయసాయి

బీసీలు ఐక్యంగా ఉండాలి: విజయసాయి

బీసీలకు రాజ్యంగపరమైన రిజర్వేషన్లు దక్కాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమతమని అందుకే తాము రాజ్యసభలో దీనిపై ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. బీసీల్లో ఉన్న 139 కులాలు సమైక్యంగా పోరాటం చేస్తేనే వారి హక్కులు సాధించుకోవడం సాధ్యమవుతుందన్నారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మంటపంలో వైఎస్సార్ సీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, గుమ్మనూరు జయరాం, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీకి చెందిన బీసీ ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ బీసీల్లో ఎవరికి వారు తాము వేరు అనుకోవద్దని, ఏ పార్టీ వారి ప్రయోజనాలు కాపాడుతుందో ఆ పార్టీకి అండగా ఉండాలన్నారు. సిఎం జగన్ ఇప్పటికే రాజకీయ పదవుల్లో బీసీలకు 50 శాతం కేటాయిస్తున్నారని, మంత్రివర్గంలో కూడా పెద్దపీట వేశారని, భవిష్యత్తులో కూడా బీసీలకు రాజకీయ సాధికారత కల్పించే విషయంలో మరిన్ని అడుగులు ముందుకు వేస్తామని భరోసా ఇచ్చారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కూడా తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్