Monday, February 24, 2025
HomeTrending Newsమావోల కొత్త ఎత్తుగడ... బీర్ బాటిల్స్ మందుపాతరలు

మావోల కొత్త ఎత్తుగడ… బీర్ బాటిల్స్ మందుపాతరలు

మావోయిస్టులు కొత్త తరహాలో దాడులకు ప్లాన్ చేస్తున్నారు. మావోయిస్టులు చాపకింద నీరులా తమ క్యాడెర్‌ను పెంచుకుంటున్నారు. దీనికి తోడు కొత్త తరహాలో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ములుగు జిల్లాలో దొరికిన కొన్ని సాక్షాలు ఇందుకు బలం చేకురుస్తున్నాయి.

ములుగు జిల్లాలో బీర్ బాటిల్స్ ఐఈడీ బాంబులు లభించడం ఆందోళనకు గురి చేస్తోంది. కూంబింగ్‌కు వెళ్లే పోలీసులే టార్గెట్‌గా వీటిని అమర్చినట్లుగా తెలుస్తోంది. వెంకటాపురం పామునూర్‌ అడవిలో బీర్ బాటిల్స్ ఐఈడీతో మందుపాతరను ఏర్పాటు చేశారు. అనుమానంతో స్పెషల్ పార్టీ, సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ తనిఖీలు చేయగా.. మందు పాతర లభించింది. వెంటనే మందుపాతరను నిర్వీర్యం చేశారు.

మొత్తం ప్రాంతాలన్ని పరిశీలించిన పోలీసులకు నివ్వరపోయే వస్తువులు లభించాయి. ఇందులో కరెంట్ వైర్లు, బీర్ బాటిల్స్, బోల్టులు, కాపర్ సీల్, గన్ పౌడర్ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కొత్త తరహాలో తయారు చేసిన బీర్ బాటిల్ మందుపాతర పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే మందుపాతర నిర్వీర్యం చేశారు పోలీసులు. బీర్ బాటిల్స్ మందుపాతర పోలీసులను విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించి పలువురు మావోయిస్టు అగ్రనేతలు చంద్రన్న, దామోదర్, కనకాల రాజిరెడ్డి, మంగు, సుధాకర్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్