Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్FIH Odisha Hockey: బెల్జియం, జర్మనీ విజయం

FIH Odisha Hockey: బెల్జియం, జర్మనీ విజయం

పురుషుల వరల్డ్ కప్ హాకీ -2023లో నేడు పూల్ ‘బి’ జట్ల మధ్య జరిగిన పోటీల్లో బెల్జియం, జట్లు విజయం సాధించాయి.

ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో బెల్జియం-సౌత్ కొరియా తలపడ్డాయి. మొదటి అర్ధభాగంలో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి. 31వ నిమిషంలో అలెగ్జాండర్ హెండ్రిక్స్  పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి బెల్జియంకు మొదటి గోల్ అందించాడు. 43, 50,52,58 నిమిషాల్లో మరో నాలుగు గోల్స్ బెల్జియం చేసింది. మొత్తం మూడు ఫీల్డ్ గోల్స్, రెండు పెనాల్టీ కార్నర్స్ ఉన్నాయి.

ఇదే స్టేడియంలో రెండో మ్యాచ్ లో జర్మనీ-జపాన్ తలపడగా 3-0 తేడాతో జర్మనీ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో సైతం మొదటి అర్ధ భాగంలో ఎవరూ గోల్ చేయలేకపోయారు. 36 వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా జర్మనీ తొలి గోల్ చేసింది. 41,49 నిమిషాల్లో మరో రెండు ఫీల్డ్ గోల్స్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్