Sunday, January 19, 2025
Homeసినిమాశ్రీనివాస్ బెల్లంకొండ, సాగర్ కె చంద్ర చిత్రం ప్రారంభం

శ్రీనివాస్ బెల్లంకొండ, సాగర్ కె చంద్ర చిత్రం ప్రారంభం

మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, పవన్ కళ్యాణ్‌ బ్లాక్ బస్టర్ ‘భీమ్లా నాయక్‌’ కి దర్శకత్వం వహించిన దర్శకుడు సాగర్ చంద్ర కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం యూనిక్ సబ్జెక్ట్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్. దర్శకుడు, శ్రీనివాస్ బెల్లంకొండ కొత్త లుక్, క్యారెక్టర్‌లో ప్రజంట్ చేయనున్నారు. #BSS10 ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరీష్ కట్టా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్.

ఈరోజు ప్రత్యేక అతిథులతో #BSS10 మూవీ ఆఫీస్ లో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైయింది. దర్శకుడు హరీష్ శంకర్ ముహూర్తం షాట్‌కు క్లాప్‌ కొట్టి, దర్శకుడు పరశురాంతో కలసి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, జిమ్షీ ఖలీద్ కెమరామెన్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా, మల్లికార్జున్ చెంచి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. జూన్ 2వ వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్