Saturday, January 18, 2025
HomeసినిమాBhairava Dweepam: 'భైరవద్వీపం' మళ్లీ వాయిదా పడిందా..?

Bhairava Dweepam: ‘భైరవద్వీపం’ మళ్లీ వాయిదా పడిందా..?

బాలకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ‘భైరవద్వీపం’. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. బాలయ్యకు జంటగా రోజా నటించగా రంభ గెస్ట్ లో నటించింది. ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బాబు పోకిరి, బిజినెస్ మేన్, పవన్ కళ్యాణ్ జల్సా, ఎన్టీఆర్ సింహాద్రి, ప్రభాస్ రెబల్, యోగి చిత్రాలు రిలీజ్ చేశారు. సీనియర్ హీరో నాగార్జున మన్మథుడు చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాలకు అనూహ్య స్పందన వచ్చింది.

బాలకృష్ణ భైరవద్వీపం చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆగష్టు 5న రీ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు ఆగష్టు 30న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలి అనుకున్నారు. దీనికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే.. ఇప్పుడు మరోసారి ఈ సినిమా రీ రిలీజ్ వాయిదా పడింది. కొన్ని కారణాల వలన ఈ మూవీ రీ రిలీజ్ వాయిదాపడిందని.. త్వరలోనే కొత్త రీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలియచేశారు. నవంబర్ లో భైరవద్వీపం రీ రిలీజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్