Saturday, January 18, 2025
Homeసినిమానెట్ ఫ్లిక్స్  ఫ్లాట్ ఫామ్ పైకి 'భజే వాయువేగం' 

నెట్ ఫ్లిక్స్  ఫ్లాట్ ఫామ్ పైకి ‘భజే వాయువేగం’ 

కార్తికేయ చాలాకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూ వస్తున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తోనే ఆడియన్స్ ముందుకు వెళ్లాలనే పట్టుదలతో మధ్యలో కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన సినిమానే ‘భజే వాయువేగం’. యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మే 31వ తేదీన విడుదలైన ఈ సినిమా, పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. వరుస ఫ్లాపులతో ఉన్న కార్తికేకి, ఈ సినిమా ఉపశమనాన్ని ఇచ్చింది.

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. స్ట్రీమింగ్ డేట్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. కార్తికేయ జోడీగా ఐశ్వర్య మీనన్ నటించిన ఈ సినిమాలో, రాహుల్ టైసన్ .. రవిశంకర్ .. తనికెళ్ల భరణి ముఖ్యమైన పాత్రలను పోషించారు. రధన్ నేపథ్య సంగీతం హైలైట్ గా నిలిచింది.

వరంగల్ రాజన్నపేట నుంచి ఈ కథ మొదలవుతుంది .. అక్కడి ఉంచి హైదరాబాద్ నేపథ్యంలో నడుస్తుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన హీరో, ఓ వ్యక్తి చేరదీయడం వలన పెద్దవాడవుతాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి కారణంగా క్రికెటర్ కావాలని అనుకుంటాడు. అందుకోసం ఎంతో ఆశతో హైదరాబాద్ లోకి అడుగుపెట్టిన అతనికి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యేయనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్