Thursday, November 28, 2024
HomeTrending Newsసంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర

సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర తెలంగాణలో…పదవ రోజు చౌటకూర్ నుంచి ప్రారంభం అయింది. నిన్న ఒక రోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి ప్రారంభమైన యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితర నేతలు రాహుల్ గాంధి తో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఆందోల్, జోగిపేట మీదుగా పెద్దాపూర్ వరకు జోడో యాత్ర సాగుతుంది. జోడో యాత్రలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న రాహుల్ ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినా మోదీ చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. వేల కోట్ల భూముల కోసమే ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ అని మండిపడ్డారు.

కేసీఆర్ కు కమీషన్ల ధ్యాస తప్ప ప్రజా సమస్యలు పట్టవంటూ రాహుల్ చేస్తున్న విమర్శలకు ప్రజలు హర్షద్వానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు రావడమే యాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవాళ 21కి.మీ కొనసాగనున్న యాత్ర కొనసాగుతుంది. దనపల్లి వద్ద భోజన విరామం, పెద్దాపూర్ లో కార్నర్ మీటింగ్, అల్లదుర్గ వద్ద రాత్రి బస చేయనున్న రాహుల్ గాంధి. కన్యాకుమారి నుంచి 58 రోజులుగా కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర…తెలంగాణలో మరో రెండు రోజుల్లో ముగించుకొని మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది.

Also Read : చిన్నారులతో రాహుల్ గాంధి క్రికెట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్