Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో చివరి రోజు రాహుల్ యాత్ర

తెలంగాణలో చివరి రోజు రాహుల్ యాత్ర

తెలంగాణలో పన్నెండవ రోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా నుంచి మొదలైన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి తో అడుగులో అడుగు వేస్తూ కదులుతున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపి మధు యాష్కి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తదితరులు రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ రోజుతో తెలంగాణలో ముగియనున్న భారత్ జోడో యాత్ర. గత 12 రోజులుగా తెలంగాణలో భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది. ఈ రోజు ఉదయం జగన్నాథ్ పల్లె మీదుగా షెహాపూర్ వరకు యాత్ర కొనసాగుతుంది. షెహాపూర్ వద్ద భోజన విరామం తీసుకోనున్న రాహుల్…అనంతరం సాయంత్రం 4గంటలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకోనున్న భారత్ జోడో యాత్ర..రాత్రి 9.30కి మహారాష్ట్ర పీసీసీ కి జాతీయ జెండాను అందించనున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్. కన్యాకుమారి నుంచి 60 రోజులుగా కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.

Also Read : కెసిఆర్, మోడీ… రైతు ద్రోహులు – రాహుల్ గాంధి

RELATED ARTICLES

Most Popular

న్యూస్