Saturday, April 20, 2024
HomeTrending Newsభారత్ జోడో యాత్ర పునః ప్రారంభం

భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం

నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ రోజు (గురువారం) తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి తిరిగి ప్రారంభమైంది. మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితర నేతలు పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం జక్లేర్ వద్ద భోజన విరామం తీసుకుంటారు.

Bharat Jodo Yatra Muktal

ఢిల్లీనుంచి రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ రోడ్డు మార్గాన మక్తల్ నియోజకవర్గం చేరుకున్నారు. గూడబల్లేరు శిబిరం నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర ఇవాళ 26 కిలోమీటర్ల 700 మీటర్లమేర సాగేవిధంగా ప్లాన్ చేశారు. ఇవాళ రాత్రి ఎలిగండ్లలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

యాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా 550 మందిని పీసీసీ ఎంపిక చేయగా వారంతా ఉదయానికె మక్తల్‌కు చేరుకున్నారు. ఈనాటి పాదయాత్రలో రాహుల్‌గాంధీ పలు ప్రజా సంఘాల ప్రతినిధులను కలువనున్నారు. ఉదయం నారాయణపేట జిల్లాకు చెందిన బీడీ కార్మికులు, తెలంగాణ ఫెడరేషన్‌ ట్రేడ్‌ యూనియన్‌లు, అసంఘటిత రంగాలకు చెందిన వారు కుల నిర్మూలన సమితి సభ్యులతో రాహుల్‌గాంధీ ముచ్చటిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్