Sunday, January 19, 2025
Homeసినిమాభీమ్లా నాయక్.. పవర్ ఫుల్ పిక్చర్

భీమ్లా నాయక్.. పవర్ ఫుల్ పిక్చర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పవర్ హౌస్ రానా దగ్గుబాటిల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మల్టీ స్టారర్ ‘భీమ్లా నాయక్’. ఈ భారీ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్వకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు – స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో భీమ్లా నాయక్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భీమ్లా నాయక్ నుంచి ఈరోజు ఓ వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి పక్కపక్కనే సేదతీరుతూ కనిపించారు. ఇందులో పవన్ మంచ పైన, రానా దగ్గుబాటి ఎండ్ల బండి పైన సేద తీరుతూ కనిపించారు. ఈ స్టిల్ చూసిన ప్రేక్షకాభిమానులు సోషల్ మీడియాలో పవర్ ఫుల్ పిక్చర్ ఆఫ్ ది డే అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పవర్ పిక్ వైరల్ అవుతుంది. ఇలా.. పిక్స్ తో.. సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న భీమ్లా నాయక్ ఇక సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్