Mega Look: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ భారీ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెగాస్టార్ తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ మోసన్ పోస్టర్‌ను షేర్ చేస్తూ అందరికీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే… చేతిలో కీ చైన్ స్టైల్‌గా తిప్పుతూ మాస్ కా బాప్ అనేలా జీపు మీద కూర్చున్న చిరంజీవి లుక్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత పక్కా మాస్ మూవీతో మెగాస్టార్ సందడి పక్కా అని అర్థమవుతుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.