Sunday, January 19, 2025
Homeసినిమానెట్ ఫ్లిక్స్  వినాయకచవితి స్పెషల్ .. 'భోళాశంకర్' 

నెట్ ఫ్లిక్స్  వినాయకచవితి స్పెషల్ .. ‘భోళాశంకర్’ 

చిరంజీవి – మెహర్ రమేశ్ కాంబినేషన్లో ‘భోళాశంకర్’ సినిమా తెరకెక్కింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేశారు. చిరంజీవి .. తమన్నా జంటగా నటించిన ఈ సినిమాలో, మెగాస్టార్ కి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించింది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాకి, థియేటర్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

అలాంటి ఈ సినిమాను ‘వినాయక చవితి’ స్పెషల్ గా ‘నెట్ ఫ్లిక్స్’ వారు ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అందుకు తగినట్టుగానే .. ఆయన నుంచి అభిమానులు కోరుకునే జోనర్లోనే ఈ సినిమా నడుస్తుంది. అయితే ‘ఇది చాలా కాలం క్రితం వచ్చిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ నే కదా’ అనే ఒక అసంతృప్తి, ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణంగా కనిపిస్తోంది.

ఈ కథ అంతా కూడా కలకత్తా నేపథ్యంలో జరుగుతుంది. తమన్నా ట్రాక్ ను సరిగ్గా డిజైన్ చేయకపోవడం .. కీర్తి సురేశ్- సుశాంత్ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం .. ట్రీట్మెంట్ పరంగా కూడా ఎక్కడా కొత్తదనం లేకపోవడం అభిమానులను నిరాశకి గురిచేసింది. మెగాస్టార్ ఎనర్జీ లెవెల్స్ తగ్గకపోయినా, ఆయనకి సంబంధించిన సీన్స్ ఎలివేట్ చేయలేకపోవడం ఒక లోపంగా అనిపిస్తుంది. ఓటీటీ ద్వారా ఈ సినిమాను ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్