Saturday, January 18, 2025
Homeఅంతర్జాతీయంనెతన్యాహుకు బైడెన్ ఫోన్

నెతన్యాహుకు బైడెన్ ఫోన్

ఇజ్రాయెల్-పాలస్తీనా దాడులకు త్వరలోనే పరిషారం లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విశ్వాసం వ్యక్తం చేసారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు బిడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. తమ భూభాగంపై వేలాది రాకెట్లు విరుచుకు పడుతుంటే వాటిని దీటుగా ఎదుర్కొనాల్సిన అవసరం ఇజ్రాయెల్ కు ఉంటుందని బైడెన్ వ్యాఖ్యానించారు.

వారం రోజులుగా ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధినేత రంగంలోకి దిగారు.
ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం, టెల్ అవివి నగరాలపై పాలస్తీనాకు చెందిన హమాస్ ఇతర టెర్రరిస్ట్ గ్రూపులు విరుచుకుపడుతున్నారు. తమ పౌరులను రక్షించుకోవడం ఇజ్రాయెల్ హక్కు అని బైడెన్ అభిప్రాయపడ్డారు. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న జెరూసలేం నగరంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లాలని ఆకాంక్షించారు.

ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్ తో పాటు పాలస్తీనా అధికారులతో కూడా అమెరికా తరపున చర్చలు జరుపుతున్నామని బైడెన్ నెన్యాహుకు వివరించారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్