Sunday, January 19, 2025
Homeసినిమాసంక్రాంతి బరిలో భారీ సినిమాలు .. ఈ సారి స్పెషలిటీ ఇదే! 

సంక్రాంతి బరిలో భారీ సినిమాలు .. ఈ సారి స్పెషలిటీ ఇదే! 

సంక్రాంతి అంటే ఎడ్ల పందాలు .. కోడి పందాల దగ్గర మాత్రమే కాదు, థియేటర్ల దగ్గర కూడా సందడి కనిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ హీరోలలో సంక్రాంతి సెంటిమెంట్ లేనివారు కనిపించరు. ఇక తమ హీరో సినిమా సంక్రాంతికి వస్తుందంటే, థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసే హడావిడి కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. అలా ఈ సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ .. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు, భారీ అంచనాల మధ్య థియేటర్లలో దిగిపోనున్నాయి.

సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే వదిలిన సాంగ్స్  జనంలోకి దూసుకుపోయాయి. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఒకరోజు ముందుగానే రిలీజ్ కానుంది. ఈ సినిమాకి తమన్ బాణీలను అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు కూడా మాస్ ఆడియన్స్ కి చాలా ఫాస్టుగా కనెక్ట్ అయ్యాయి.

ఇక అటు మెగాస్టార్ తో .. ఇటు బాలయ్యతో ఆడిపాడనున్నది శ్రుతి హాసన్ కావడం విశేషం. చిరంజీవి – బాలకృష్ణ ఒక రోజు తేడాతో సంక్రాంతికి రావడం ఒక విశేషమైతే, ఈ రెండూ మాస్ యాక్షన్ సినిమాలు కావడం మరో విశేషం. ఇద్దరి జోడీగా కనిపించేది ఒకే హీరోయిన్ కావడం ఇంకో విశేషం. ఇక ఈ పండుగ రోజున పెద్ద బ్యానర్ల మధ్య గట్టి పోటీ ఉంటూ ఉంటుంది. కానీ ఈ సినిమాల విషయంలో ఆ టెన్షన్ లేదు. మెగాస్టార్ సినిమాను .. బాలయ్య మూవీని నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ వారే కావడం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ బద్ధకాన్ని ఏ రేంజ్ లో వదిలిస్తాయనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్