Sunday, February 25, 2024
Homeసినిమామ‌హేష్‌, ప‌వ‌న్ త‌ర్వాత ప్ర‌భాస్.

మ‌హేష్‌, ప‌వ‌న్ త‌ర్వాత ప్ర‌భాస్.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్.. ఈ ముగ్గురికి ఎంత‌టి అభిమాన గ‌ణం ఉందో.. అంద‌రికీ తెలిసిందే. అయితే.. స్టార్ హీరోల‌ పాత సినిమాల‌ను కొత్త‌గా రిలీజ్ చేయ‌డం అనేది ట్రెండ్ గా మారింది. మ‌హేష్ బాబు న‌టించిన ‘పోకిరి’ సినిమా చ‌రిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. భారీ స్థాయిలో రిలీజైన ‘పోకిరి’ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అదే బాటలో ‘తమ్ముడు’, ‘జల్సా’ స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. ఈ హంగామా ఆగష్టు 31 నుండి సెప్టెంబర్ 2, 2022 వరకు జరుగుతుంది. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో అభిమానులు జ‌ల్సా సినిమాను థియేట‌ర్లో చూసేందుకు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. దీనికి భారీగా స్పంద‌న ల‌భిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జ‌ల్సా సినిమాను రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేశారు.

మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర్వాత ప్ర‌భాస్ వంతు వ‌స్తుంది. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ న‌టించిన ‘బిల్లా’ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలో బిల్లా 4కె వెర్షన్‌ను రెడీ కానుంది. విడుదల తేదీ మరియు ఇతర వివరాలు త్వ‌ర‌లో ప్రకటిస్తారు. మ‌రి.. ‘బిల్లా’ 4 కె వెర్సెన్ తో ప్ర‌భాస్ ఎలాంటి రికార్డు సెట్ చేస్తాడో..?

Also Read : పోకిరి రికార్డ్ ను జ‌ల్సా బ్రేక్ చేస్తుందా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్